హైదరాబాద్ రియల్ ఎస్టేట్: భారీ ప్లాన్ తో రంగంలోకి బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్!
- కొంపల్లిలో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ చేపట్టనున్న బ్రిగేడ్
- 5.6 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న ప్రీమియం వెంచర్
- ఈ ప్రాజెక్టు ద్వారా రూ.850 కోట్ల ఆదాయం అంచనా
- హైదరాబాద్‌లో విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఒప్పందం
- రాబోయే 3-4 ఏళ్లలో రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్న సంస్థ
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. నగరంలోని కొంపల్లి ప్రాంతంలో 5.6 ఎకరాల స్థలంలో ఒక ప్రీమియం రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ.850 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది.
ఈ ఒప్పందం కింద, భూ యజమానితో కలిసి బ్రిగేడ్ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనుంది. అయితే, భూ యజమాని వివరాలను కంపెనీ వెల్లడించలేదు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ, హైదరాబాద్‌ను తమ వృద్ధికి కీలకమైన మార్కెట్‌గా పరిగణిస్తోంది. భవిష్యత్తులో కూడా నగరంలో మరిన్ని భూములను కొనుగోలు చేసి, కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
రాబోయే 3-4 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా రెసిడెన్షియల్, కమర్షియల్, హాస్పిటాలిటీ, రిటైల్ ప్రాజెక్టులలో సుమారు రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని బ్రిగేడ్ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది. 1986లో స్థాపించిన ఈ సంస్థ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, మైసూర్‌తో పాటు పలు ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, విద్యారంగాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.